కేటీఆర్‌ కంటే ఈటల సిఎం అయితే మేలు: సుధాకర్

ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరకు సుధాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇంటి పార్టీ తరఫున చెరకు సుధాకర్ పోటీ చేస్తున్నారు. నిన్న మహబూబాబాద్‌లో ఎన్నికల సన్నాహక సభలో మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ తర్వాత ఈటల రాజేందర్‌కు ఎక్కువ ప్రజాధారణ ఉన్నదన్నారు. కాబట్టి సీఎం పదవికి ఈటల రాజేందర్ అన్ని విధాలా అర్హుడని అన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఈటల రాజేందర్ తనకు కేటాయించిన శాఖలలో తనదైన ముద్ర వేశారని అన్నారు. మంత్రి కేటీఆర్‌కు ఇంకా పాలనానుభవం రావాలని అన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి నేటి వరకు ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశారో తెలపాలని చెరుకు సుధాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.