9.jpg)
జిహెచ్ఎంసి ఎన్నికలలో జూబ్లీహిల్స్ (వార్డు నెంబర్:95)లో గెలిచిన బిజెపి కార్పొరేటర్ డి.వెంకటేష్ ఎన్నిక చెల్లదంటూ ఆయన చేతిలో ఓడిపోయిన టిఆర్ఎస్ అభ్యర్ధి కె. సూర్యనారాయణ హైకోర్టులో పిటిషన్ వేశారు. కార్పొరేటర్ డి. వెంకటేష్ కు నలుగురు పిల్లలున్నారన్న విషయాన్ని దాచి పెట్టి ఎన్నికలలో పోటీ చేశారని ఆరోపిస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. జిహెచ్ఎంసి చట్టం 21(3) ప్రకారం ఇద్దరు కంటే ఎక్కువమంది పిల్లలు ఉన్నవారు జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో పోటీకి అనర్హులని, కనుక డి.వెంకటేష్ ఎన్నిక చెల్లదని ప్రకటించాలని, ఆయన ప్రమాణస్వీకారం చేయకుండా నిరోధించాలని హైకోర్టును పిటిషన్ ద్వారా కోరారు. ఈ పిటిషన్‌పై బుదవారం విచారణకు చేపట్టిన హైకోర్టు దీనిపై మూడు నెలలలోపు నివేదిక ఇవ్వాలని ఎన్నికల ట్రిబ్యునల్‌ను ఆదేశించి కేసును అప్పటికి వాయిదా వేసింది.