నవయువకుడిలా రాహుల్ గాంధీ

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ గుర్తుకురాగానే కుర్తా, పైజామాతో ఉన్నరూపం కళ్ళముందు ప్రత్యక్షమవుతుంది. ఎందుకంటే నిత్యం ఆయన వాటిలోనే కనిపిస్తుంటారు కనుక. అయితే నిన్న ఆయన పార్లమెంటుకు వచ్చినప్పుడు కాంగ్రెస్‌ ఎంపీలే గుర్తుపట్టలేకపోయారు. ఎప్పుడూ కుర్తా, పైజామాతో నెరిసిన గెడ్డంతో కనిపించే రాహుల్ గాంధీ నిన్న నున్నగా షేవ్ చేసుకొని, ఫార్మల్ డ్రెస్సులో టక్ చేసుకొని ఓ చేతిలో ల్యాప్‌టాప్ పట్టుకొని కాలేజీ కుర్రాడిలా... సినిమా హీరోలా వచ్చారు. మొదట ఆయనను చూసి తికమకపడిన కాంగ్రెస్‌ ఎంపీలు తరువాత ఆనందంతో మురిసిపోతూ అభినందించారు. ఈ ఫోటో చూస్తే మీకు అదే అనిపించవచ్చు. 

గమ్మతైన విషయం ఏమిటంటే, లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తరువాత కొంతకాలంపాటు నెరిసిపోయిన గెడ్డంతో వయసుకి మించి ముసలివాడిగా కనిపించారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడూ ఆయన ఇంట్లో నుంచే వీడియో కాన్ఫరెస్ ద్వారా పార్టీ నేతలతో, మీడియాతో సమావేశాలు నిర్వహించేవారు. అప్పుడు ఆయనను చూసినవారు అచ్చం ఆయన తండ్రి దివంగత ప్రధాని రాజీవ్ గాంధీలా ఉన్నారని అన్నారు. అంతకు ముందు విదేశాలకు వెళ్లినప్పుడు మంచి సూటుబూటు వేసుకొని దొరబాబులా కనిపించారు. ఇటీవల తమిళనాడులో పర్యటించినప్పుడు జీన్ ఫ్యాంట్, టీషర్ట్ ధరించి కుర్రాడిలా కనిపించారు. ఇప్పుడు కాలేజీ కుర్రడిలా మారిపోయారు. ఇలా రోజుకో వేషంలో రాహుల్ గాంధీ అందరినీ ఆశ్చర్యపరుస్తుండటం విశేషమే.