
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వేతనాల పెంపు, వయో పరిమితి పెంపు, పదోన్నతుల పై ప్రభుత్వం త్రిసభ్య కమిటీ ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరోసారి ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నుంచి విజ్ఞాపన లకు అవకాశం ఇచ్చింది. ఇదివరకే కొన్ని ఉద్యోగ సంఘాలు విజ్ఞాపనలు ఇచ్చాయి.
త్రిసభ్య కమిటీ కి వచ్చిన విజ్ఞాపన లన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించి నివేదికను తయారు చేస్తామన్నారు.
ప్రభుత్వం ఇచ్చిన గడువులోగానే నివేదికను అందజేస్తామని అధికారులు తెలిపారు.
పిఆర్సి 20శాతం నుండి 30 శాతం వరకు ఉండవచ్చునని అధికారులు సంకేతాలు ఇస్తున్నారు. పిఆర్సి పెంచినట్లయితే ప్రభుత్వంపై మూడు వందల కోట్ల రూపాయల అదనపు వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.