.jpg)
రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ నిన్న రాజన్న సిరిసిల్లా జిల్లా పర్యటనలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. జిల్లాలోని కోనరావుపేట మండలంలో మంత్రి కేటీఆర్ నిన్న పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా భాజపా కార్యకర్తలు మంత్రి కేటీఆర్ వాహనశ్రేణిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. టిఆర్ఎస్ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై దాడిచేసినందుకు మంత్రి కేటీఆర్ బిజెపిని తీవ్రంగా హెచ్చరించినందుకు నిరసనగా బిజెపి కార్యకర్తలు మంత్రి కేటీఆర్‌ను అడ్డుకొనేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో భాజపా, తెరాస కార్యకర్తల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. అక్కడే ఉన్న పోలీసులు కొంతమంది భాజపా కార్యకర్తలను అదుపులోకి తీసుకొని తరువాత విడిచి పెట్టారు. ఆ ఒక్క ఘటన తప్ప జిల్లాలో కేటీఆర్ పర్యటన సజావుగా సాగింది.