కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తుతం లోక్‌సభలో 2021-22 సం.లకు ఆర్ధిక బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. బడ్జెట్ హైలైట్స్:
1. కరోనా వ్యాక్సినేషన్ కోసం రూ.35,000 కోట్లు ఖర్చు చేస్తున్నాం.
2. రక్షిత మంచినీటి పధకాలకు రూ.87,000 కోట్లు ఖర్చు చేశాము.
3. స్వచ్చ భారత్ పధకం కోసం రూ.1,41,678 కోట్లు ఖర్చు చేశాము.
4. దేశంలో 500 నగరాలలో రూ.87,000 కోట్లు ఖర్చు చేసి మురుగునీరు శుద్ధి కేంద్రాలు ఏర్పాటుచేశాము.
5. వాయుకాలుష్య నివారణకు రూ. 2,217 కోట్లు కేటాయింపు. కాలుష్య నివారణకు 15 ఏళ్ళు దాటిన వాణిజ్య వాహనాలపై నిషేదించబోతున్నాం.
6. ఆరోగ్యరంగానికి రూ.64,180 కోట్లు ప్రత్యక నిధి ఏర్పాటు చేస్తాం.
7. ఆత్మనిర్భర్ ఆరోగ్య పధకానికి రూ. 2,23,846 కోట్లు కేటాయింపు.
8. దేశంలో మరో 5 జాతీయరహదారులను అభివృద్ధి చేస్తాం. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో రూ.25,000 కోట్లు, అసోం రాష్ట్రంలో రోడ్ల నిర్మాణానికి రూ.19,000 కోట్లు కేటాయిస్తాం.
9. రైల్వేశాఖలో మౌలికసౌకర్యాల కల్పనకు రూ. 1,01,055 కోట్లు కేటాయింపు.
10. విద్యుత్ రంగానికి రూ.3.05 లక్షల కోట్లు కేటాయింపు.
11. చెన్నై మెట్రోకు రూ.63,246 కోట్లు, బెంగళూరు మెట్రోకు రూ.14,788 కోట్లు, రూ.18,000 కోట్లతో బస్ ట్రాన్స్పోర్ట్. మెట్రో నియో, మెట్రో లైట్ పధకాలు ప్రవేశపెడతాం.
12. సరుకు రవాణాకు ప్రత్యేక రైల్వేలైన్లు నిర్మిస్తాం. 2022 జూన్‌లోగా ఖరగ్‌పూర్-విజయవాడ మద్య ఈస్ట్ కోస్ట్ సరుకు రవాణా కారిడార్‌ను ఏర్పాటుచేస్తాం.
13. కరోనాతో కుదేలైన తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రత్యేక ఆర్ధికసంస్థ ఏర్పాటు చేస్తాం.
14. కరోనా నేర్పిన గుణపాఠాలతో ఓ జాతీయ వ్యాది నివారణ కేంద్రం, దేశవ్యాప్తంగా 15 ఎమర్జన్సీ వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. తొమ్మిది బీఎస్ఎల్-3 స్థాయి ప్రయోగశాలలు ఏర్పాటుచేస్తాం. దేశంలో మరో నాలుగు ప్రాంతీయ వైరల్ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తాం. ప్రతీ జిల్లా స్థాయిలో సమీకృత వ్యాధి నిర్దారణ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం.
15. రానున్న మూడేళ్ళలో వివిద రాష్ట్రాలలో 7 మెగా టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు చేస్తాం.
16. దేశంలో కొత్తగా 5 వ్యవసాయ హబ్‌లు ఏర్పాటు చేస్తాం.
17. దేశంలో కొత్తగా 100 సైనిక స్కూల్స్ ఏర్పాటు చేస్తాం.
18. ఆదివాసీ ప్రాంతాలలో 750 ఏకలవ్య పాఠశాలలు ఏర్పాటుచేస్తాం.
19. భీమారంగంలో ఎఫ్.డీ.ఐ (ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్) 49 నుంచి 74 శాతానికి పెంపు. డిపాజిట్లపై భీమా పెంపు.
20. గెయిల్, ఐఓసీ, హెచ్పీసీఎల్లో పైప్ లైన్లలో ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ.
21. రూ.50 లక్షల నుండి రూ.2 కోట్లలోపు పెట్టుబడితో పెట్టిన పరిశ్రమలు చిన్న పరిశ్రమలుగా మార్పు.