
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న నల్లగొండలో మీడియాతో మాట్లాడుతూ అన్ని పార్టీలలో వారసత్వ రాజకీయాలకు చరమగీతం పాడాల్సిందేనని అన్నారు. అప్పుడు మాత్రమే కొత్త నేతలు రాజకీయాలకు వస్తారని అన్నారు. త్వరలో జరగబోయే సాగర్ ఉపఎన్నికలలో తన అనుచరులు ఎవరైనా పోటీకి సిద్ధమని తెలిపితే పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. ఒకవేళ తన కుమారుడైన రఘువీర్ రెడ్డిని పోటీలో నిలబెట్టాలని అనుచరులు అడిగితే అప్పుడు చూద్దామని అన్నారు.
ఇదిలా ఉండగా దుబ్బాక, జిహెచ్ఎంసి జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సాగర్ ఉపఎన్నిక కాంగ్రెస్ పార్టీకి పరీక్షలాంటిదని పలువురు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.