
బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. నిన్న మహబూబ్ నగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డి.కె.అరుణ మాట్లాడుతూ నారాయణపేట జిల్లాను చేసినా అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. నారాయణపేట మండలంగా ఉన్నప్పుడే కాస్త అభివృద్ధి జరిగింది కానీ ఇప్పుడు మాత్రం అభివృద్ధికి నోచుకోలేదని ఆరోపించారు. నారాయణపేట నియోజకవర్గంలో కనీసం ఒక ఎకరాకు కూడా ప్రభుత్వం నీరు అందించలేదని ఆరోపించారు. నారాయణపేట జిల్లాకు మంజూరైన సైనిక స్కూల్, రైల్వే లైన్ ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితి ఉందని అన్నారు. నారాయణపేట నియోజకవర్గ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డిది మన రాష్ట్రమేనా లేక పక్క రాష్ట్రానికి ఎమ్మెల్యేనా?అని ప్రశ్నించారు. జిల్లా అభివృద్ధి కోసం ప్రభుత్వాన్ని నిధులను అడిగే ధైర్యం ఆయనకు లేదని అన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఆయన టిఆర్ఎస్‌లో కొనసాగుతున్నార డి కె.అరుణ అన్నారు. ఆయన వలన జిల్లాకు, నియోజకవర్గానికి ఒరిగిందేమీ లేదని డికె.అరుణ అన్నారు.