దేశానికి నాలుగు రాజధానులు ఉండాలి: మమతా బెనర్జీ

ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం కోల్‌కతాలో సుభాష్ జయంతి ఉత్సవాల  కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆమె ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, కేంద్రప్రభుత్వం ప్రకటించినట్లుగా  సుభాష్ సుభాష్ జయంతిని పరాక్రమ దివస్‌గా కాకుండా, దేశ్ నాయక్ దివాస్‌గా జరుపుకోవాలని బెంగాల్ ప్రజలకు పిలుపునిచ్చారు. బ్రిటిష్ వారి కాలంలో కోల్‌కతా దేశరాజధానిగా ఉండేదని గుర్తు చేశారు. భారతదేశ జనాభా అంతకంతకూ పెరుగుతున్నందున భారతదేశానికి నాలుగు రాజధానులు ఉండాలని మమతా బెనర్జీ సూచించారు. చిన్న దేశమైన దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులు ఉన్నాయని అలాంటప్పుడు మన దేశంలో కూడా నాలుగు రాజధానులు ఉండాలని అన్నారు.