మంచిర్యాల జిల్లా కలెక్టర్‌కు హైకోర్టు నోటీసులు

మంచిర్యాల జిల్లా కలెక్టర్‌ భారతి హోళీకేరి, బెల్లంపల్లి టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వారిరువురూ నిబందనలకు విరుద్దంగా డీఎంఎఫ్టీ నిధులతో ప్రైవేట్ వెంచర్లను ఏర్పాటుచేశారని జిల్లా బిజెపి నేతలు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. సుమారు రూ.90 లక్షలు నిధులను వారిరువురూ దుర్వినియోగం చేశారని బిజెపి నేతలు ఫిర్యాదు చేశారు. వారి పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు కలెక్టర్‌ భారతి హోళీకేరికి, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యలకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాలలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.