గుజరాత్‌లో రెండు మెట్రో ప్రాజెక్టులకు మోడీ శ్రీకారం

ప్రధాని నరేంద్రమోడీ తన సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో ఒకేసారి రెండు మెట్రో ప్రాజెక్టులకు మోడీ శ్రీకారం చుట్టారు. వాటిలో ఒకటి అహ్మదాబాద్‌లో నిర్మించబోతున్న రెండో దశ మెట్రో రైల్‌ ప్రాజెక్టుకాగా మరొకటి సూరత్ మెట్రో మెట్రో రైల్‌లో ప్రాజెక్టు. రూ.5,384 కోట్లు వ్యయంతో అహ్మదాబాద్‌లో నిర్మించబోతున్న మెట్రో ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీ నుంచే భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఇక సూరత్‌లో రూ.12,020 కోట్లు వ్యయంతో రెండు దశలలో నిర్మించబోతున్న మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు కూడా ప్రధాని నరేంద్రమోడీ నేడు ఢిల్లీ నుంచే శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “2014కు మునుపు 10-12 ఏళ్ళలో దేశంలో కేవలం 225 కిమీ మెట్రో రైల్‌ లైన్స్ మాత్రమే ఉండేవి. కానీ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దేశవ్యాప్తంగా 450 కిమీ లైన్లు వేశాము. మరో 1,000 కిమీ మెట్రో లైన్లు వేయబడుతున్నాయి. గతంలో మెట్రోకు అసలు నిర్ధిష్ట విధివిధానాలే ఉండేవి కావు. కానీ ఇప్పుడు రైళ్లు, బస్సులు అన్నిటినీ మెట్రోలతో అనుసంధానం చేసే విధంగా సమగ్రమైన వ్యవస్థను నిర్మిస్తున్నాము. దేశంలో ప్రధాన వ్యాపారకేంద్రాలైన అహ్మదాబాద్, సూరత్‌లలో నిర్మించబోతున్న ఈ మెట్రో మెట్రో రైల్‌ ప్రాజెక్టులతో మెట్రో కనెక్టివిటీ మరింత పెరుగుతుంది,” అని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు.