రాష్ట్ర కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ!

ఫిరాయింపులతో ఇప్పటికే చాలా బలహీనపడిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరో ఎదురుదెబ్బ తగిలింది. వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే  ఏ. చంద్రశేఖర్ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో కొత్తగా వచ్చినవారికే ప్రాధాన్యం ఇస్తున్నారని, ఎప్పటినుండో పార్టీలో ఉన్న తనవంటి వారికి పట్టించుకోవడంలేదని ఆయన ఆరోపించారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. రాష్ట్రంలో టిఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా అవతరించిన  భాజాపాలో ఈనెల 18వ తేదీన చేరనున్నట్లు చంద్రశేఖర్ ప్రకటించారు.