తెలంగాణ ప్రభుత్వోద్యోగులకు శుభవార్త

తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి టి.హరీష్ రావు నిరుద్యోగులకు తీపి కబురు అందించారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం ప్రైవేటు ఉద్యోగుల సంఘం డైరీని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ భారతదేశంలోని నిరుద్యోగ సమస్య అతి తక్కువగా ఉన్న రాష్ట్రంగా తెలంగాణ ఉందని తెలిపారు. జనవరి నెలాఖరులోగా అర్హులైన ఉద్యోగులకు పదోన్నతులు ఇస్తామన్నారు. వివిధ శాఖల నుంచి ఖాళీలు ఉద్యోగాలను భర్తీకి సీఎం సిఎం కేసీఆర్‌ ఆమోదం తెలిపారని అన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలలో సుమారు 50 వేల ఉద్యోగాలు ఖాళీ భర్తీకి తమ ప్రభుత్వం సిద్ధమైందన్నారు. రాష్ట్రానికి అనేక ప్రైవేట్ కంపెనీలను రప్పించడం ద్వారా కూడా ఉద్యోగాల కల్పనకు తమ ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తోందన్నారు మంత్రి హరీష్‌రావు.