ఇక ప్రతీ ఎన్నికలో బిజెపిదే గెలుపు: రఘునందన్ రావు

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తెరాసపై విమర్శలు చేశారు. రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ  తెరాసను ఎదుర్కొనే శక్తి భాజపాకు మాత్రమే ఉందన్నారు. రాబోవు సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికలలో భాజపాను    గెలిపించాలన్నారు. తెలంగాణ రాష్ట్రం  ఏర్పడినప్పటి నుండి ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను పెంచక ఇబ్బంది పెడుతున్నారు. సిద్దిపేట నుండి తెరాస పతనం ప్రారంభమవుతుందన్నారు. రాబోవు ప్రతీ ఎన్నికలలో ప్రజలు భాజపానే ను గెలిపిస్తారనే నమ్మకం తనకుందని అన్నారు. సీఎం కేసీఆర్ అనాలోచిత విధానాలతో రాష్ట్రం... ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని కనుక వాటిని అడ్డుకొనేందుకు పోరాడుతామన్నారు.