
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గురువారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజల మేలు కోసమే రాష్ట్రంలో కూడా ‘ఆయుష్మాన్ భారత్’ పధకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. మంత్రి ఈటెల మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దీని కోసం సుమారు రూ.1,000-1,200 కోట్లు వరకు ఖర్చవుతుందని అన్నారు. కనుక దీని కోసం కేంద్ర ప్రభుత్వం కనీసం రూ.200-300 కోట్ల వరకు సహాయం అందించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుందని భావనతోనే రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ పధకాన్ని కూడా అమలుచేయాలని నిర్ణయించామన్నారు. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని చేసినవేనని అన్నారు. ఆయుష్మాన్ భారత్ కింద సుమారు రూ 5 లక్షల వరకు, రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఆరోగ్యశ్రీ కింద రూ2 లక్షల వరకు ఇన్స్యూరెన్స్ కవర్ అవుతుంది.