ఖమ్మం మునిసిపల్ ఎన్నికలలో 60 సీట్లు మావే: పువ్వాడ

తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బుధవారం ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఖమ్మంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత బహిరంగసభలో ప్రసంగిస్తూ, తెరాసలో ఎలాంటి గ్రూపులు లేవన్నారు. తామంతా కెసిఆర్, కేటీఆర్ సారథ్యంలో పనిచేస్తానన్నారు. సిఎం కెసిఆర్, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ సహాయసహకారాలతో ఖమ్మం పట్టణాన్ని అన్నివిధాల అభివృద్ధి చేసి ఖమ్మం పట్టణానికి కావలసిన అన్ని సదుపాయాలను కల్పిస్తామన్నారు.  ప్రజలే తమ బాసులని వారికి తప్ప మరెవరికీ తాము జవాబు చెప్పుకోవలసిన అవసరం లేదన్నారు. ప్రజల ఆశీర్వాదలతో రాబోవు ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలలో తెరాసకు 60 సీట్లు గెలుచుకొంటుందని మంత్రి పువ్వాడ జోస్యం చెప్పారు.