సిఎం కేసీఆర్‌ మంచి నిర్ణయం తీసుకొన్నారు: జగ్గారెడ్డి

వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లకు ఎల్ఆర్ఎస్‌ నిబందనను అమలుచేయరాదని సిఎం కేసీఆర్‌ తీసుకొన్న నిర్ణయాన్ని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్వాగతించారు. ఎల్ఆర్ఎస్‌ను రద్దు చేయాలంటూ తాను బుదవారం గాంధీభవన్‌లో ఒక్కరోజు నిరసన దీక్ష చేస్తానని ప్రకటించగానే సిఎం కేసీఆర్‌ దిగివచ్చి రద్దు చేశారని జగ్గారెడ్డి అన్నారు. ఎల్ఆర్ఎస్‌ను కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి వ్యతిరేకిస్తోందన్నారు.