ప్రభుత్వోద్యోగులకు, నిరుద్యోగులకు శుభవార్త

కొత్త సంవత్సరం కానుకగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వోగుల వేతనాలను పెంచాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. అలాగే ఉద్యోగుల పదవీ విరమణ వయసును కూడా  పెంచాలని నిర్ణయించారు. వేతనాల పెంపు, కారుణ్య  నియామకాల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సిఎం కేసీఆర్‌ సంbదిత శాఖల అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వోద్యోగులతో పాటు వివిద విభాగాలలో పనిచేస్తున్న డైలీ వేజెస్ ఉద్యోగులు, టైం కంటింజెంట్ ఉద్యోగులు, పార్ట్ టైం ఉద్యోగులు, అంగన్వాడీ ఉద్యోగులు, ఆశా వర్కర్లు, విద్యా వాలంటర్లు, సెర్బ్  ఉద్యోగులు అందరికీ ప్రయోజనం చేకూరేలా వేతనాల పెంచుతామని సీఎం ప్రకటించారు. తెలంగాణలో అన్ని శాఖలలో అన్ని రకాల ఉద్యోగులు కలిపి మొత్తం 9,36,976 ఉన్నారని వారందరికీ వేతనాల పెంచుతామని చెప్పారు. 

వేతనాల పెంపుతో పాటు ఉద్యోగ పదవీ విరమణ వయసు పెంపు, పదోన్నతులు ఇవ్వడం, బదిలీలు చేపట్టడం, సర్వీస్ నిబంధనలను రూపొందించడం, ఉద్యోగ సంబంధిత అంశాలన్నిటినీ ఫిబ్రవరిలోగా పూర్తిగా పరిష్కరించాలని సీఎం వెల్లడించారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను  గుర్తించాలన్నారు. అన్ని శాఖల ఖాళీలను గుర్తించి ఫిబ్రవరిలోగా ఉద్యోగ నియామకాల ప్రక్రియను చేపడుతున్నట్లు సీఎం ప్రకటించారు.

అలాగే...ప్రభుత్వోద్యోగం చేస్తూ మరణించేవారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశం కల్పించాలన్నారు. ఉద్యోగం చేస్తూ మరణించిన కుటుంబ సభ్యులను ఉద్యోగం కోసం కార్యాలయాల చుట్టూ తిరగకుండా కారుణ్య నియామకాలను చేపట్టాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని శాఖలలో కారుణ్య నియామకాలను వెంటనే పూర్తి చేయాలని సిఎం అధికారులకు సూచించారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు వారికి చెల్లించవలసిన అన్ని బెనిఫిట్స్ అదే రోజున చెల్లించి సగౌరవంగా వీడ్కోలు పలకాలని సిఎం కేసీఆర్‌ సూచించారు.