
తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తులు రిజిస్ట్రేషన్లకు అడ్డంకిగా నిలుస్తున్న ఎల్ఆర్ఎస్ నిబందనను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేసింది. ఎల్ఆర్ఎస్‌తో సంబందం లేనివాటికి రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చునని తెలిపింది. కనుక ఇప్పటికే రిజిస్టర్డ్ అయిన భూములు, ఎల్ఆర్ఎస్ పొందిన భూముల క్రయవిక్రయాల(రిజిస్ట్రేషన్ల)కు పెద్ద అవరోదం తొలగిపోయింది. అయితే క్రమబద్దీకరణ కానీ స్థలాలకు, అనుమతులు లేనివాటికి మాత్రం రిజిస్ట్రేషన్లు సాధ్యం కాదని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్‌కు అవకాశం కల్పించినప్పటి నుంచి సుమారు 26 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఒకవేళ హైకోర్టు స్టే విధించకపోయుంటే ఇంకా లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చి ఉండేవి.