రాష్ట్రంలో నియంత్రితసాగు విధానానికి స్వస్తి

రాష్ట్రంలో రైతుల సంక్షేమం, అభివృద్ధి కొరకు ఎన్నో పధకాలు, కార్యక్రమాలు అమలుచేస్తున్న తెలంగాణ ప్రభుత్వం, రైతులకు మరింత లబ్ది చేకూర్చాలనే సదుద్దేశ్యంతో నియంత్రితసాగు విధానం అమలుచేసింది. కానీ అకాల వర్షాలు, వరదలు, ఇంకా అనేక ఇతర కారణాల చేత ఆ పద్దతిలో పంటలు పండించిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. కనుక రాష్ట్రంలో మళ్ళీ పాతపద్దతి ప్రకారమే రైతులు తమకు నచ్చిన పంటలు వేసుకోనీయాలని, పంటల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోరాదని సిఎం కేసీఆర్‌ నిర్ణయించారు. కొత్త వ్యవసాయ చట్టం అమలులోకి వచ్చిన తరువాత గ్రామాలలో పంటకొనుగోలు కేంద్రాలను ఎత్తివేయవలసిరావడం కూడా ఓ కారణమని తెలుస్తోంది. ఆదివారం ప్రగతి భవన్‌లో వ్యవసాయ అధికారులతో జరిపిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకొన్నారు.