1.jpg)
రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ నిధులు విడుదల చేయాలని కోరుతూ వరుసగా కేంద్రమంత్రులకు లేఖలు వ్రాస్తున్నారు. మొదట కేంద్రవాణిజ్యమంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ వ్రాసిన మంత్రి కేటీఆర్ నిన్న కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశారు. వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్కుకు, సిరిసిల్లలోని మెగా పవర్‌లూమ్ క్లస్టర్‌కు, రాష్ట్రంలో చేనేత, ఇతర వస్త్ర పరిశ్రమల అభివృద్ధి కోసం 2021-2022 కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని కోరారు. సిరిసిల్లలో రూ.993.65 కోట్ల వ్యయంతో మెగా పవర్‌లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయనున్నామని, దీని కోసం రూ.49.54 కోట్లు కేటాయించాలని మంత్రి కేటీఆర్ లేఖలో కోరారు. చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించేందుకుగాను రెండేళ్ల పాటు చేనేతపై జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయాలని కోరారు. అలాగే రాష్ట్రానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ కేటాయించాలన్నారు. రాష్ట్ర, దేశాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సుముఖంగా ఉన్నామని లేఖలో పేర్కొన్నారు.