10.jpg)
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ కేంద్రానికి నిన్న లేఖ రాశారు. ఆ లేఖలో తెలంగాణలో పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా ఏర్పాటుచేస్తున్న ఫార్మాసిటీ, జహీరాబాద్‌లోని నీమ్స్ ఆసుపత్రికి, నేషనల్ డిజైన్ సెంటర్ ఏర్పాటుకు కేంద్రం బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరారు. ఈ మేరకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ రాశారు. పారిశ్రామిక కారిడార్‌లో అభివృద్ధికి రూ.5,000 కోట్లు వరకు అవసరం ఉంటుందని లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులను ఫాస్ట్ ట్రాక్ విధానం అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని కనుక 2021-2022 కేంద్ర బడ్జెట్లో కనీసం 50 శాతమైనా నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఫార్మా రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని కనుక నిధులు కేటాయించి సహకరిస్తే ఆ రంగంలో తెలంగాణ మరింత అభివృద్ధి సాధించగలదని మంత్రి కేటీఆర్ కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు విజ్ఞప్తి చేశారు.