కరీంనగర్‌ అభివృద్ధికి తోడ్పడతా: బండి

మంగళవారం కరీంనగర్‌ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ శశాంక, జెడ్పి చైర్ పర్సన్, మున్సిపల్ కమిషనర్ క్రాంతి, రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు...ఎంపీ బండి సంజయ్ మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి జరగాలన్నారు. అందుకు తాను, తన పార్టీ అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. స్థానిక  ప్రజాప్రతినిధులు, అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేసి కరీంనగర్‌ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని బండి సంజయ్‌ సూచించారు.