సంబంధిత వార్తలు

రాష్ట్రంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ఎంపికపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ధనపాల్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. గోరేటి వెంకన్న, సారయ్య, దయానందల నియామకం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ పేర్కొన్నారు. గవర్నర్ తన పేరును రెండుసార్లు ప్రతిపాదించిన ప్రభుత్వం పట్టించుకోకుండా, తెలంగాణ మంత్రి వర్గ సిఫార్సులను ఆమోదించడాన్ని పిటిషనర్ అభ్యంతరం తెలిపారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.