
కేంద్రప్రభుత్వం రూ.9,440 కోట్లు వ్యయంతో తెలంగాణ రాష్ట్రంలో వివిద జిల్లాలలో మొత్తం 396 కిలోమీటర్లు పొడవున్న రహదారులను నిర్మించబోతున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. ఈనెల 21న కేంద్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కారీ ఢిల్లీ నుంచే వర్చువల్ విధానంలో వీటికి శంఖుస్థాపన చేయనున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. ఇదిగాక రూ.3,717 కోట్లు వ్యయంతో రాష్ట్రంలో ఇప్పటికే నిర్మించిన 370 కిమీ రహదారులను కూడా నితిన్ గడ్కారీ వర్చువల్ విధానంలో ప్రారంభించి జాతికి అంకితం చేస్తారని చెప్పారు. భారతమాల ప్రాజెక్టులో భాగంగా దేశవ్యాప్తంగా కొత్తగా 35,000 కిమీ పొడవునా రహదారులు నిర్మిస్తున్నామని వాటిలో తెలంగాణ రాష్ట్రంలో 1,400 కిమీ పొడవున నిర్మిస్తున్నట్లు మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
ఈనెల 21న రాష్ట్రంలో ప్రారంభోత్సవం కానున్న హైవే ప్రాజెక్టుల వివరాలు:
1. హైదరాబాద్ ఔటర్‌రింగ్ రోడ్డు నుంచి ఎన్‌హెచ్-765డీలో మెదక్ సెక్షన్ వరకు 63కిమీల రోడ్డు.
2. వరంగల్ జిల్లాలో ఎన్‌హెచ్-353సీలో 35 కిమీల రోడ్డులో రెండు లేన్లలో క్యారేజ్ వే విస్తరణ.
3. వరంగల్-యాదగిరిగుట్ట మద్య గల ఎన్‌హెచ్-163లో భాగంగా 99 కిమీ పొడవునా నిర్మించిన నాలుగు లేన్ల హైవే రోడ్డు.
4. వరంగల్ జిల్లాలో ఎన్‌హెచ్-163లో భాగంగా రెండు లేన్లతో నిర్మించిన 35కిమీ రోడ్డు.
5. నకిరేకల్- తానంచెర్ల వరకు ఎన్‌హెచ్-365లో భాగంగా నిర్మించిన 67కిమీ రోడ్డు.
6. మన్నెగూడ-రావులపల్లి ఎన్‌హెచ్-163లో భాగంగా నిర్మించిన 73కిమీల రెండు లేన్ల రోడ్డు.
కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ ఈనెల 21న శంఖుస్థాపన చేయబోయే రోడ్ల వివరాలు:
1. ఎన్‌హెచ్-161లో భాగంగా కంది నుంచి రాంసన్ పల్లె వరకు 40కిమీల నాలుగులేన్ల రోడ్డు నిర్మాణం.
2. ఎన్‌హెచ్-161లో భాగంగా రాంసన్ పల్లె నుంచి మంగ్లూర్ మీదుగా మహారాష్ట్ర సరిహద్దు వరకు 47కిమీల నాలుగులేన్ల రోడ్డు నిర్మాణం.
3. ఎన్‌హెచ్-161లో భాగంగా మాంగ్లూరు నుంచి మహారాష్ట్ర సరిహద్దు వరకు 49 కిమీల నాలుగులేన్ల రోడ్డు నిర్మాణం.
4. ఎన్‌హెచ్-363లో భాగంగా రేపల్లెవాడ నుంచి మహారాష్ట్ర సరిహద్దు వరకు 53కిమీల నాలుగులేన్ల రోడ్డు నిర్మాణం.
5. ఎన్‌హెచ్-363లో భాగంగా మంచిర్యాల నుంచి మహారాష్ట్ర సరిహద్దు వరకు 42 కిమీల నాలుగులేన్ల రోడ్డు నిర్మాణం.
6. ఎన్‌హెచ్-365 (బి)లో భాగంగా సూర్యాపేట నుంచి ఖమ్మం వరకు 59 కిమీల నాలుగులేన్ల రోడ్డు నిర్మాణం.
7. ఎన్‌హెచ్-565లో భాగంగా నకిరేకల్ నుంచి నాగార్జునసాగర్ వరకు 85కిమీల రోడ్డు పెండింగ్ వర్కులు.
8. ఎన్‌హెచ్-61లో భాగంగా నిర్మల్ పట్టణం నుంచి ఖానాపూర్ వరకు 22 కిమీల రెండులేన్ల రోడ్డు నిర్మాణం.