పీఆర్సీ కోసం తెలంగాణ ప్రభుత్వోద్యోగులు ధర్నా

తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ (టీఈఏ) అధ్వర్యంలో ఈనెల అన్ని జిల్లాలలో కలెక్టర్‌ కార్యాలయాల ముందు ధర్నాలు చేయబోతున్నట్లు టీఈఏ రాష్ట్ర అధ్యక్షుడు సంపత్ కుమార్ స్వామి బుదవారం ప్రకటించారు. పీఆర్సీ గడువు ఎప్పుడో ముగిసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కొత్త పీఆర్సీని ప్రకటించలేదని, రెండు డీఏ బకాయిలను ఇంతవరకు చెల్లించకుండా తాత్సారం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఈనెల 21న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల వద్ద మధ్యాహ్నం భోజన విరామసమయంలో ధర్నాలు చేసి ప్రభుత్వానికి నిరసనలు తెలియజేయాలనుకొంటున్నామని సంపత్ కుమార్ స్వామి చెప్పారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ స్పందించకుంటే ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. పీఆర్సీ, డీఏ బకాయిలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ సంబందించిన సమస్యలు కనుక అందరూ ఈ నిరసన కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేసారు.