
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో సహా దేశంలో తొమ్మిది రాష్ట్రాల హైకోర్టులకు కొత్త న్యాయమూర్తులు, ప్రధాన న్యాయమూర్తుల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియమ్ ఖరారు చేసి కేంద్రానికి పంపింది. అది లాంఛనప్రాయమే కనుక ఈ బదిలీలు ఖరారు అయినట్లే.
సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ ఆరూప్‌కుమార్ గోస్వామి ఏపీ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీపై వస్తున్నారు. అలాగే కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చి కూడా ఏపీ హైకోర్టుకు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు.
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేసిన జస్టిస్ జెకే. మహేశ్వరి సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వెళుతున్నారు.
ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టీస్ట్ హిమ కోహ్లీ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
ఇంతకాలం తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ ఉత్తరాఖండ్ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీపై వెళుతున్నారు.
ప్రస్తుతం న్యాయమూర్తులుగా చేస్తూ వేరే రాష్ట్రాలకు ప్రధాన న్యాయమూర్తులుగా పదోన్నతితో బదిలీ అవుతున్నవారు:
జస్టిస్ హిమకోహ్లీ (ఢిల్లీ హైకోర్టు) తెలంగాణ హైకోర్టుకు బదిలీ
జస్టిస్ ఎస్.మురళీధర్ పంజాబ్, హర్యానా హైకోర్టు నుంచి ఒడిశా హైకోర్టుకు బదిలీ.
జస్టిస్ పంకజ్ మిత్తల్ అలహాబాద్ హైకోర్టు నుంచి జమ్ముకశ్మీర్ హైకోర్టుకు బదిలీ.
జస్టిస్ సంజీబ్ బెనర్జీ కోల్‌కతా హైకోర్టు నుంచి మద్రాస్ హైకోర్టుకు బదిలీ.
జస్టిస్ సుధాంశు ధులియా ఉత్తరాఖండ్ హైకోర్టు నుంచి గౌహతీ హైకోర్టుకు బదిలీ.
బదిలీ అయిన న్యాయమూర్తుల వివరాలు:
జస్టిస్ సంజయ్ యాదవ్ మధ్యప్రదేశ్ నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ.
జస్టిస్ రాజేష్ బిందాల్ జమ్ముకశ్మీర్ నుంచి కోల్‌కతా హైకోర్టుకు బదిలీ.
జస్టిస్ వినీత్ కొఠారి మద్రాస్ నుంచి గుజరాత్ హైకోర్టుకు బదిలీ.
జస్టిస్ సతీష్ చంద్రశర్మ మధ్యప్రదేశ్ నుంచి కర్ణాటక హైకోర్టుకు బదిలీ.