
తెలంగాణ సిఎం కేసీఆర్ ఇటీవల ఢిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్రమోడీని, కేంద్రమంత్రులను కలవడంపై రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై టిఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్‌కు తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం కనుక రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన ఎవరినైనా కలుస్తారు. ఎవరితోనైనా మాట్లాడతారు. అందులో తప్పు లేదు. అయినా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ప్రధానిని, కేంద్రమంత్రులను కలవడం సర్వసాధారణమైన విషయం. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల మద్య ఇటువంటి సంబంధాలు సర్వసహజం. ఎంపీగా ఎన్నికైన బండి సంజయ్‌కు ఇంత చిన్న విషయం కూడా తెలియకుండా 'సిఎం కేసీఆర్ ప్రధాని నరేంద్రమోడీ ముందు వంగి వంగి దండాలు పెట్టారంటూ' నోటికి వచ్చినట్లు మాట్లాడటం సరికాదు. ఇకనైనా బండి సంజయ్ విషయ పరిజ్ఞానం పెంచుకొని మాట్లాడితే మంచిది లేకుంటే ప్రజలే బుద్ధి చెపుతారు,” అని అన్నారు.