
సుప్రీంకోర్టు కొలీజియమ్ దేశంలో వివిద హైకోర్టుల న్యాయమూర్తులను బదిలీ చేయబోతోంది. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర చౌహా న్‌ను ఉత్తరాఖండ్ హైకోర్టుకు బదిలీ చేసి ఆయన స్థానంలో ఢిల్లీ హైకోర్టులో జడ్జీగా పనిచేస్తున్న జస్టిస్ హిమ కోహ్లీని నియమించనున్నట్లు తాజా సమాచారం.
ఢిల్లీకి చెందిన జస్టిస్ హిమ కోహ్లీ ఢిల్లీలోనే డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి 1984లో న్యాయవిద్యలో డిగ్రీ చేసి న్యాయవాద వృత్తిలో ప్రవేశించారు. ఆమె 1999-2004 సం.ల మద్య కాలంలో ఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్‌కు స్టాండింగ్ కౌన్సిల్ మరియు సలహాదారుగా సేవలు అందించారు. జస్టిస్ హిమ కోహ్లీ 2006లో ఢిల్లీ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అప్పటి నుంచి వివిద ప్రభుత్వం కమిటీలలో సభ్యురాలిగా, ఛైర్ పర్సన్‌గా సేవలందించారు. త్వరలోనే జస్టిస్ హిమ కోహ్లీని తెలంగాణ హైకోర్టు ప్రధానన్యాయమూర్తిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ కానున్నాయి.