సంబంధిత వార్తలు

బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కరోనా బారినపడ్డారు. మొన్న శనివారం కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దాంతో ఆయన వెంటనే హోమ్ ఐసోలేషన్లోకి వెళ్లారు. తనకు కరోనా సోకినప్పటికీ ఆరోగ్యంగానే ఉన్నానని, గత 10-15 రోజులుగా తనను కలిసిన వారందరూ వైద్య పరీక్షలు చేయించుకొని అవసరమైతే హోమ్ క్వారెంటైన్లో ఉండాలని ఆయన ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు.