నారాయణపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం

నారాయణపేట జిల్లాలో బుదవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు ఘటనాస్థలంలోనే మరణించారు. చనిపోయినవారిలో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. ఈ ప్రమాదంలో కారు డ్రైవరు గాయపడగా ఓ చిన్నారి క్షేమంగా బయటపడింది. 

తాజా సమాచారం ప్రకారం హైదరాబాద్‌కు చెందిన వారందరూ కారు (టిఎస్ 26టి 6673)లో రాయచూర్ వెళుతున్నప్పుడు మక్తల్ మండలంలో గుడిగండ్ల గ్రామశివారులో కారు అదుపుతప్పి బోల్తాపడింది. సమాచారం అందుకొన్న పోలీసులు అక్కడకు చేరుకొని డ్రైవరును స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతని ద్వారా మృతుల వివరాలు తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని మృతదేహాలను పోస్టుమార్టం కొరకు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.