ఎవరెస్ట్ ఎత్తు పెరిగింది...

ప్రపంచలోకెల్ల అత్యంత ఎత్తైన పర్వత శిఖరంగా నిలిచిన ఎవరెస్ట్ పర్వతం మరికొద్దిగా ఎత్తు పెరిగింది. మొదటిసారిగా 1954లో భారత ప్రభుత్వం సర్వే చేసి ఎవరెస్ట్ ఎత్తు 8,848 మీటర్లు అని ప్రకటించింది. అప్పటి నుంచి అదే ప్రామాణికంగా ఉంది. అయితే ఇటీవల భూకంపాల కారణంగా ఎవరెస్ట్ ఎత్తు తగ్గిందంటూ ఊహాగానాలు వినిపిస్తుండటంతో నేపాల్ దేశం చైనా సహకారంతో సర్వే చేసి ఎవరెస్ట్ ఎత్తును కొలిచింది. ఎవరెస్ట్ ఎత్తు ఏమాత్రం తగ్గలేదని పైగా మరో 0.86 మీటర్ ఎత్తు పెరిగిందని నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది. తాజా లెక్కప్రకారం ఎవరెస్ట్ ఎత్తు 8,848.86 మీటర్లు అని ప్రకటించింది.