
నేడు జరుగుతున్న భారత్ బంద్‌పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “దేశంలో కొన్ని రాజకీయపార్టీలు తమ రాజకీయలబ్ది కోసం లేదా శక్తిప్రదర్శన చేసేందుకే ఈరోజు బంద్‌లో పాల్గొంటున్నాయి తప్ప రైతుల కోసం కాదు. దేశంలో రెండు మూడు రాష్ట్రాలలో రైతులు మాత్రమే ఆందోళనలు చేస్తున్నారు. మిగిలిన రాష్ట్రాలలో రాజకీయపార్టీలే బంద్ నిర్వహిస్తుండటం గమనిస్తే ఇది రాజకీయ మైలేజ్ కోసం చేస్తున్న బంద్ అని అర్దమవుతుంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ రైతుల సంక్షేమం కోసం ఏమీ చేయలేదు. కానీ మా ప్రభుత్వం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిపుణులతో చర్చించి, వాటిని పరిష్కరించేందుకు కొత్త చట్టాలు తీసుకువస్తే కాంగ్రెస్ పార్టీ వాటిని కూడా వ్యతిరేకిస్తోంది. రైతులకు మద్దతు తెలిపే సాకుతో కాంగ్రెస్ పార్టీ బంద్ నిర్వహిస్తూ మా ప్రభుత్వంపై బురద జల్లాలని ప్రయత్నిస్తోంది. తెలంగాణలో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సిఎం కేసీఆర్ బంద్‌కు మద్దతు ప్రకటించడం చాలా హాస్యాస్పదంగా ఉంది. కేవలం రాజకీయ దురుదేశ్యంతోనే సిఎం కేసీఆర్ వ్యవసాయచట్టాల గురించి రాష్ట్రంలో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు,” అని అన్నారు.