
అసెంబ్లీ, లోక్సభ స్థాయిలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికలలో బిజెపి కారణంగా ఈసారి టిఆర్ఎస్ కేవలం 55 డివిజన్లు మాత్రమే గెలుచుకోగలిగింది. అదే కారణంగా ఈసారి టిఆర్ఎస్ ఓటింగ్ శాతం కూడా తగ్గిపోయింది. ఈసారి టిఆర్ఎస్కు 35.73 శాతం రాగా, బిజెపికి 35.55 శాతం వచ్చింది. అంటే బిజెపి కంటే టిఆర్ఎస్కు కేవలం 0.18 శాతం మాత్రమే అధికంగా వచ్చింది. అలాగే టిఆర్ఎస్కు మొత్తం 11,92,162 ఓట్లు పడగా, బిజెపికి 11,86,096 పడ్డాయి. అంటే బిజెపి కంటే టిఆర్ఎస్కు కేవలం 6,066 ఓట్లు అధికంగా పడ్డాయి. సాధారణంగా లక్షల్లో మెజార్టీకి అలవాటు పడిన టిఆర్ఎస్కు ఇంత స్వల్పతేడాతో 55 సీట్లు గెలుచుకోవడం చాలా అవమానకరమే అని చెప్పవచ్చు. తెలంగాణలో ఉనికి కోల్పోయిందనుకొందనుకొన్న టిడిపికి ఈ ఎన్నికలలో పోటీ చేసి 55,287 ఓట్లు గెలుచుకోవడం విశేషమే. ఒకవేళ టిడిపి పోటీలో లేకపోయుంటే దానికి పడిన 55,287 ఓట్లు కాంగ్రెస్, టిఆర్ఎస్ ఖాతాలలో జమా అయ్యుండేవేమో?
గ్రేటర్ ఎన్నికలలో మొత్తం 34,44,093 ఓట్లు నందో కాగా వాటిలో 79, 735 ఓట్లు చెల్లకుండాపోయాయి. మరో 28,661 ఓట్లు ‘నోటా’కు పడ్డాయి. మిగిలిన 33,35,697 ఓట్లలో 5 ప్రధానపార్టీలకు పడిన ఓట్లు, ఓట్ల శాతం ఈవిధంగా ఉంది.
టిఆర్ఎస్: 11,92, 162 ఓట్లు-35.73 శాతం
బిజెపి: 11,86,096 ఓట్లు- 35.55 శాతం
మజ్లీస్: 6,30,867 ఓట్లు- 18.91 శాతం
కాంగ్రెస్: 2,20,504 ఓట్లు-6.61 శాతం
టిడిపి: 55,287 ఓట్లు-1.65 శాతం