రాజ్‌న్యూస్ ఛానల్‌పై టిఆర్ఎస్‌ ఫిర్యాదు

ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్‌ రాజ్‌ న్యూస్‌పై టిఆర్ఎస్‌ ఎన్నికల సంఘం కమీషనర్‌కు పిర్యాదు చేసింది. టిఆర్ఎస్‌ పార్టీ తరపున ఆ పార్టీ ప్రధానకార్యదర్శి సోనుభరత్‌కుమార్‌, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, కల్యాణ్‌రావు తదితరులు సోమవారం సాయంత్రం రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ చ్‌. పార్థసారధిని కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. రాజ్‌ న్యూస్ ఛానల్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశ్యించి అనుచిత వ్యాఖ్యలు చేస్తోందని, టిఆర్ఎస్‌ పార్టీ, పార్టీ నేతల గురించి ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు కధనాలు ప్రసారం చేస్తోందని వారు ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియామవళికి విరుద్దంగా తప్పుడు వార్తలు, కధనాలు ప్రసారం చేస్తోందని కనుక ఆ న్యూస్ ఛానల్‌పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేసారు.