నేడు హైదరాబాద్‌లో అమిత్ షా ఎన్నికల ప్రచారం

జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా కేంద్రహోంమంత్రి అమిత్ షా ఇవాళ్ళ హైదరాబాద్‌లో ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు. ఆయన ఢిల్లీ నుంచి  ప్రత్యేక విమానంలో ఉదయం 10 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకొంటారు. అక్కడి నుంచి నేరుగా ఛార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయానికి చేరుకొని, అక్కడ ప్రత్యేక పూజలు చేసిన తరువాత 11.15 గంటలకు వారాసిగూడ చౌరస్తాలో బిజెపి కార్యాలయానికి చేరుకొని అక్కడ పార్టీ నేతలతో సమావేశమవుతారు. మధ్యాహ్నం ఒంటిగంటకు అక్కడి నుంచి సీతాఫల్ మండీలోని హనుమాన్ మందిరం వరకు రోడ్ షో నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు నాంపల్లి బిజెపి కార్యాలయం చేరుకొని అక్కడే పార్టీ ముఖ్య నేతలతో కలిసి భోజనం చేస్తారు. భోజన విరామం తరువాత పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యి జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై సమీక్షా సమావేశం నిర్వహించి వారికి అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తారు. వారితో సమావేశం ముగిసిన తరువాత మళ్ళీ బేగంపేట విమానాశ్రయం చేరుకొని ప్రత్యేక విమానంలో ఢిల్లీ తిరిగివెళతారు.

కేంద్రహోంమంత్రి అమిత్ షా పర్యటన సందర్భంగా ఛార్మినార్ పరిసర ప్రాంతాలలో భారీగా పోలీసులను మోహరించి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.