మర్యాదలు వద్దనుకొంటే ఎవరికి నష్టం?

ప్రధాని నరేంద్రమోడీ పూణే నుంచి ప్రత్యేక విమానంలో కొద్దిసేపటి క్రితం హకీంపేట విమానాశ్రయానికి చేరుకొన్నారు. తనకు స్వాగతం పలకడానికి గవర్నర్‌ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్‌ విమానాశ్రయానికి రానవసరం లేదని ముందే చెప్పడంతో వారిరువురూ వెళ్ళలేదు. ప్రధాని కార్యాలయ అధికారులు సూచించినట్లే   మేడ్చల్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, సీఎస్ తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, సైబరాబాద్ సిపి సజ్జనార్, హకీంపేట ఎయిర్ ఆఫీస్ కమాండెంట్ మాత్రమే వెళ్ళి ప్రధాని నరేంద్రమోడీకి స్వాగతం పలికారు. సరిపోతుందని చెప్పారు. విమానాశ్రయం నుంచి నేరుగా భారత్‌ బయోటెక్ కంపెనీకి వెళ్ళి అక్కడ తయారవుతున్న కోవాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌ ఫలితాల గురించి ప్రధాని నరేంద్రమోడీ అడిగితెలుసుకోనున్నారు. 

ఆనవాయితీ ప్రకారం ప్రధాని నరేంద్రమోడీని ఆహ్వానించేందుకు గవర్నర్‌, ముఖ్యమంత్రి విమాశ్రయానికి వస్తారు. కానీ వారిని ఎందుకు రావద్దన్నారో ప్రధాని కార్యాలయం వివరణ ఇవ్వకపోవడం వలన, సిఎం కేసీఆర్‌ దానిని అవమానంగా భావిస్తే తప్పుకాదు. కనీసం ఈ ఆనవాయితీని పక్కనపెట్టడానికి ఫలానా కారణం అని చెప్పిఉన్నా బాగుండేది. అయినా దేశానికి ప్రధాని ఓ రాష్ట్రానికి వస్తే అక్కడ ఆయనకు ఆహ్వానం పలికేందుకు ఎవరూ రాకపోతే అది ఆయనకు కూడా అవమానమే కదా? ఇప్పుడు ఏ కారణం చేత ఆహ్వానం వద్దనుకొన్నా మళ్ళీ ఎప్పుడైనా రాష్ట్రానికి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదేవిదంగా వ్యవహరిస్తే?