2.jpg)
తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఇవాళ్ళ ఓ ప్రముఖ తెలుగు మీడియా ప్రతినిధి ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ప్రశ్నలకు చెప్పిన సమాధానాలు ఆలోచింపజేస్తాయి.
ప్రశ్న: మీ పార్టీలో నుంచి నేతలు బిజెపిలోకి వచ్చేస్తారని గాంధీభవన్ మూసుకోవాలని అంటున్నారు?
జవాబు: విజయశాంతి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా వెళ్లిపోతారన్నారు కదా?కానీ వెళ్ళలేదు కదా? కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ. బిజెపి మతతత్వపార్టీ. లౌకికవాదానికి కట్టుబడినవారెవరూ బిజెపిలో చేరరు. కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయినవారు, ఏ సిద్దాంతాలు లేనివారు మాత్రమే పార్టీలు మారుతుంటారు. అటువంటివారు వెళ్ళిపోయినా నష్టం లేదు. కాంగ్రెస్ పార్టీ అనేక ఒడిదుడుకులు చూసింది. అయినా నేటికీ తట్టుకొని నిలబడే ఉంది.
ప్రశ్న: టిఆర్ఎస్-బిజెపిల యుద్ధంలో కాంగ్రెస్‌ను ఎవరూ పట్టించుకోవడం మానేశారు?
జవాబు: టిఆర్ఎస్-బిజెపిలు పైకి పోరాడుకొంటున్నట్లు నటిస్తున్నప్పటికీ ఆ రెండు పార్టీల మద్య రహస్య అవగాహనే ఉంది. కాంగ్రెస్ ప్రభావాన్ని తగ్గించేందుకు ఆ రెండు పార్టీలు చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని ప్రజలు ఎవరూ నమ్మరు. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్ని వర్గాల ప్రజలను సమానంగా చూస్తుంది. ఈ విషయం ప్రజలందరికీ తెలుసు. కనుక టిఆర్ఎస్-బిజెపిలు ఎన్ని డ్రామాలు ఆడినా జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్ పార్టీనే గెలిపిస్తారు.