అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ మృతి

సీనియర్ కాంగ్రెస్‌ నేత, అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ (84) సోమవారం సాయంత్రం  కనుమూశారు. ఇటీవల ఆయనకు కరోనా సోకింది కానీ చికిత్సతో కొల్కోన్నారు. మళ్ళీ ఆరోగ్యసమస్యలు మొదలవడంతో గువాహాటి మెడికల్ కాలేజీలో చేరి చికిత్స పొందుతూ ఈరోజు కనుమూశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్రమోడీ, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తదితరులు ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు.