సంబంధిత వార్తలు

డిసెంబర్ 1వ తేదీన జరుగబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో ఈసారి సిఎం కేసీఆర్ పాల్గొబోతున్నట్లు తాజా సమాచారం. ఈనెల 28వ తేదీన నగరంలోని ఎల్బీ స్టేడియంలో సిఎం కేసీఆర్ ఓ భారీ బహిరంగసభ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో టిఆర్ఎస్‌కు నాయకత్వం వహిస్తున్న పురపాలకశాఖ మంత్రి కేటీఆర్, ఈనెల 22 నుంచి ప్రచారానికి చివరి రోజైన 29 వరకు నగరంలో రోడ్ షోలు నిర్వహించబోతున్నారు. కుత్బుల్లాపూర్ నుంచి ఈ రోడ్ షోలు ప్రారంభిస్తారని తెలుస్తోంది.