జీహెచ్‌ఎంసీ నామినేషన్లకు నేడే చివరిరోజు

జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో నామినేషన్లు దాఖలు చేయడానికి నేడే చివరిరోజు. ఇవాళ్ళ మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్లకు గడువు ముగుస్తుంది. గురువారం మొత్తం 522 మంది అభ్యర్ధులు 580 నామినేషన్లు దాఖలుచేశారు. వారిలో టిఆర్ఎస్‌ నుండి 195 మంది, బిజెపి 140, కాంగ్రెస్‌ 68, టిడిపి 47, మజ్లీస్ 27, సిపిఎం 4, సిపిఐ 1, ఇతర పార్టీల నుంచి 16, స్వతంత్ర అభ్యర్ధులు 110 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఈరోజే చివరి రోజు కనుక నేడు మరింత భారీగా నామినేషన్లు దాఖలు కానున్నాయి. డిసెంబర్‌ 1వ తేదీన ఎన్నికలు నిర్వహించి, 4వ తేదీన ఫలితాలు ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌లో తెలియజేసింది.