టిఆర్ఎస్‌ అభ్యర్ధుల రెండో జాబితా విడుదల

జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో పోటీ చేయబోతున్న 20 మంది అభ్యర్ధులతో కూడిన రెండో జాబితాను టిఆర్ఎస్‌ గురువారం మధ్యాహ్నం విడుదల చేసింది. నిన్న ప్రకటించిన 105 మంది అభ్యర్ధులతో కలిపి ఇప్పటివరకు మొత్తం 125 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించినట్లయింది. ఇంకా మిగిలిన 25 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించవలసి ఉంది. ఈరోజు ప్రకటించిన అభ్యర్ధుల పేర్లు...వారు పోటీ చేస్తున్న డివిజన్ల వివరాలు:  

మల్లాపూర్‌: దేవేందర్‌రెడ్డి; రామాంతపూర్‌: జోత్స్న; బేగంబజార్‌: పూజావ్యాస్‌ బిలాల్‌; సులేమాన్‌నగర్‌: సరితామహేష్‌; శాస్త్రిపురం: రాజేష్‌ యాదవ్‌; రాజేంద్రనగర్‌: శ్రీలత; హిమాయత్‌నగర్‌: హేమలత యాదవ్‌; బాగ్‌అంబర్‌పేట: పద్మావతి రెడ్డి; 

భోలక్‌పూర్‌: నవీన్‌ కుమార్‌; షేక్‌పేట్‌: సత్యనారాయణ యాదవ్‌; శేరిలింగంపల్లి: రాగం నాగేందర్‌; అడ్డగుట్ట: ప్రసన్న లక్ష్మి; మెట్టుగూడ: రాసూరి సునీత; బౌద్ధనగర్‌: కంది శైలజ; బేగంపేట్‌: మహేశ్వరి శ్రీహరి; వివేకానందనగర్‌ కాలనీ:  రోజా రంగారావు;

వినాయక్‌నగర్‌: బద్ధం పుష్పలతరెడ్డి; బాలానగర్‌: రవీందర్‌రెడ్డి; కూకట్‌పల్లి: సత్యనారాయణ జూపల్లి; మైలార్‌దేవ్‌పల్లి- ప్రేమ్‌దాస్‌ గౌడ్‌.