
తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్ వివిద జిల్లాల కలెక్టర్లను వేరే జిల్లాలకు బదిలీ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దుబ్బాక ఉపఎన్నికలకు ముందు ఎన్నికల సంఘం ఆదేశం మేరకు సిద్ధిపేట కలెక్టర్గా చేస్తున్న పి.వెంకట రామిరెడ్డిని సంగారెడ్డికి బదిలీ చేసిన సంగతి తెలిసిందే. మళ్ళీ ఆయనను సిద్ధిపేటకు బదిలీ చేసి మెదక్ అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు.
అలాగే దుబ్బాక ఉపఎన్నికలకు ముందు సిద్ధిపేట కలెక్టర్గా నియమితులైన భారతి హోళీకేరిని మళ్ళీ మంచిర్యాలకు బదిలీ చేసి ఆమెకు పెద్దపల్లి అదనపు బాధ్యతలు అప్పగించారు.
అలాగే దుబ్బాక ఉపఎన్నికల సమయంలో మెదక్ జిల్లాకు బదిలీ అయిన ఎం.హన్మంతరావును మళ్ళీ సంగారెడ్డి జిల్లా కలెక్టర్గా నియమించారు.
హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతికి మేడ్చల్ మల్కాజగిరి అదనపు బాధ్యతలు అప్పగించబడ్డాయి.