14.jpg)
సిఎం కేసీఆర్ త్వరలో ఢిల్లీ వెళ్ళనున్నారు. అక్కడ వసంత్ విహార్‌లో టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మించుకొనేందుకు కేంద్రప్రభుత్వం 1,100 చదరపు మీటర్ల స్థలం కేటాయించడంతో దాని శంఖుస్థాపనకు సిఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్ళనున్నారు. కార్తీకమాసంలో మంచి ముహూర్తాలున్నాయి కనుక దీపావళి తరువాత ఢిల్లీ వెళ్ళి శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రప్రభుత్వం స్థలం అప్పగించగానే దానిని చదునుచేసే పనులు మొదలయ్యాయని టిఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. రెండు మూడు రోజులలో సిఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన, టిఆర్ఎస్ కార్యాలయం శంఖుస్థాపన కార్యక్రమానికి ముహూర్తం ఖరారు చేసి అధికారికంగా ప్రకటించవచ్చు.