
బిహార్ శాసనసభ ఎన్నికలలో తుదివిడత పోలింగ్ శనివారం ఉదయం 7 గంటలకు
ప్రారంభం అయ్యింది. మొత్తం 243 శాసనసభ స్థానాలలో మొదటి రెండు దశలలో 165 స్థానాలకు పోలింగ్
పూర్తయింది. ఇవాళ్ళ మిగిలిన 78 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ 78 స్థానాలకు 1,204 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. ఈరోజు జరుగుతున్న పోలింగ్లో 17 జిల్లాలలోని
మొత్తం 2.34 కోట్లమంది ఓటర్లు వారి భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఓటర్లలో పురుషులు 1.23
కోట్లు, మహిళలు 1.12 కోట్ల మంది ఉన్నారు.
ముస్లిం జనాభా అధికంగా ఉన్న కోసి సీమాంచల్ ప్రాంతంలో మజ్లీస్
పార్టీ తన అభ్యర్ధులను నిలబెట్టింది. ఈరోజు పోలింగ్ జరుగుతున్న స్థానాలలో అధికార జేడీయూ-23,
బిజెపి-20, ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీ-20, దాని మిత్రపక్షం కాంగ్రెస్ -11, ఇతరులు-4 స్థానాలలో పోటీ చేస్తున్నాయి.
ఈనెల 10వ తేదీన బిహార్ ఫలితాలతో పాటు దేశవ్యాప్తంగా తెలంగాణలోని దుబ్బాకతో సహా వివిద రాష్ట్రాలలో 54 శాసనసభ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల ఫలితాలు కూడా వెలువడతాయి.