ట్రంప్‌-బైడెన్ మద్య ఉత్కంఠభరితమైన పోటీ

మంగళవారం అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ముగియగానే ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొదలైంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాలలో డొనాల్డ్ ట్రంప్‌పై ఆయన ప్రత్యర్ధి డెమొక్రాట్ అభ్యర్ధి జో బైడెన్ కాస్త ఆధిక్యతలో ఉన్నారు. డోనాల్డ్ ట్రంప్‌ 14 రాష్ట్రాలలో 92, జో బైడెన్‌ 13 రాష్ట్రాలలో మొత్తం 131 ఎలక్టోరల్ కాలేజ్‌ ఓట్లు పొందారు. కీలకమైన ఫ్లోరిడా, జార్జియా రాష్ట్రాలలో ఇరువురి మద్య నువ్వా...నేనా అన్నట్లు పోటీ కొనసాగుతోంది. మొత్తం 538 ఎలక్టోరల్ కాలేజ్‌ ఓట్లలో 270 సాధించినవారికే అధ్యక్ష పదవి దక్కుతుంది. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు జోరుగా సాగుతోంది. ఒకవేళ ఇద్దరిలో ఎవరో ఒకరు భారీ తేడాతో గెలిస్తే ఎటువంటి సమస్య ఉండదు కానీ ఇద్దరిలో ఎవరు స్వల్ప తేడాతో ఓడిపోయినా పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు మరికొన్ని గంటలు పట్టవచ్చు.