జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సన్నాహాలు షురూ

రాష్ట్ర ఎన్నికల సంఘం జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించింది. ముందుగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని 150 వార్డులకు రిటర్నింగ్ అధికారులను, సహాయ రిటర్నింగ్ అధికారుల పేర్లను నిన్న ఖరారు చేసింది. ముందుజాగ్రత్త చర్యలలో భాగంగా మరో 61 మంది రిటర్నింగ్ అధికారులను, మరో 71 మంది సహాయ రిటర్నింగ్ అధికారుల పేర్లను కూడా నిన్న ఖరారు చేసింది. 

ఇటీవల పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ టిఆర్ఎస్‌ నేతలతో మాట్లాడుతూ నవంబర్‌ 2వ వారంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉందన్నట్లు చెప్పారు. జీహెచ్‌ఎంసీ పాలకమండలి పదవీకాలం ఫిబ్రవరి వరకు ఉన్నప్పటికీ రాష్ట్ర ఎన్నికల సంఘం అప్పుడే ఎన్నికలకు సన్నాహాలు చేస్తుండటం గమనిస్తే మంత్రి కేటీఆర్‌ చెప్పినట్లుగా దుబ్బాక ఉపఎన్నికల ఫలితాలు (నవంబర్‌ 10) వెలువడగానే లేదా అంతకంటే కొంచెం ముందుగానే రాష్ట్ర ఎన్నికల సంఘం జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది.