
రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేసి ఆసుపత్రిలో చేర్చారు. సిద్దిపేటలో పర్యటిస్తున్నప్పుడు పోలీసులు తనతో దురుసుగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ ఆయన కరీంనగర్లో తన కార్యాలయంలో దీక్షకు కూర్చోన్నారు. దాంతో ఆయన షుగర్ లెవెల్స్ పడిపోయాయి. వైద్యుల సూచన మేరకు పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేసి నగరంలోని అపోలో రీచ్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు సెలైన్ ఎక్కించిన తరువాత కోలుకొన్నారు. మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, వివేక్ అక్కడకు చేరుకొని నిమ్మరసం ఇచ్చి బండి సంజయ్ చేత దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా వారు సిద్దిపేట పోలీసుల తీరును తప్పు పట్టారు. పోలీసులు అధికార టిఆర్ఎస్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. త్వరలోనే రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని జితేందర్ రెడ్డి అన్నారు.