నవంబర్‌ నెలాఖరు వరకు పాత మార్గదర్శకాలే

లాక్‌డౌన్‌ సడలింపులో భాగంగా గతనెల అన్‌లాక్‌-5 కోసం కేంద్రప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శకాలను యధాతధంగా నవంబర్‌ నెలాఖరు వరకు కొనసాగుతాయని కేంద్రం ఇవాళ్ళ ప్రకటించింది. దేశంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టిందనే భావనతో ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా కరోనా జాగ్రత్తలు పాటించవలసిందిగా విజ్ఞప్తి చేసింది. కరోనా జాగ్రత్తలు పాటించేందుకు ప్రధాని నరేంద్రమోడీ ఈనెల 8వ తేదీన ‘జన్ ఆందోళన్’ అనే ఓ కార్యక్రమం ప్రకటించారు. దానిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేసింది. అన్ని రాష్ట్రాలలో కరోనా జాగ్రత్తల గురించి మరింత విస్తృతంగా ప్రచారం చేసి అమలుచేయాలని కేంద్రహోంశాఖ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసింది.