
దుబ్బాక ఉపఎన్నికలకు సోమవారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. గడువు ముగిసేసరికి 11 మంది నామినేషన్లు ఉపసంహరించుకొన్నారని తెలిపారు. మొత్తం 46 మంది నామినేషన్లు వేయగా వారిలో 12 మంది నామినేషన్లు పరిశీలనలో తిరస్కరించబడినట్లు రిటర్నింగ్ అధికారి చెన్నయ్య చెప్పారు. మిగిలిన 23 మంది అభ్యర్ధులలో 8 మంది వివిద పార్టీలకు చెందినవారు కాగా మిగిలిన 15 మంది స్వతంత్ర్య అభ్యర్ధులని తెలిపారు.
అయితే పోటీ ప్రధానంగా అధికార టిఆర్ఎస్‌కు, ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బిజెపిలకు మద్యే ఉంటుందని చెప్పవచ్చు. టిఆర్ఎస్ అభ్యర్ధిగా సోలిపేట సుజాత, కాంగ్రెస్ అభ్యర్ధిగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి, బిజెపి అభ్యర్ధిగా రఘునందన్ రావు పోటీ చేస్తున్నారు. నవంబర్ 3వ తేదీన పోలింగ్ జరుగనుంది. నవంబర్ 10వ తేదీన ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.